: తిరుమలలో నిలిచిన పలు సేవలు


తిరుమలలో సాంకేతికలోపంతో కంప్యూటర్లు పనిచేయడం లేదు. దాంతో, తిరుమలలో గంట నుంచి పలు సేవలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దివ్యదర్శనం, ఆర్జితసేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు, గదుల కేటాయింపు, ఇంకా పలు సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వెంటనే తిరుమల ఈడీపీ విభాగం అధికారులు సర్వర్ల మరమ్మతు పనులు చేస్తున్నారు. మూడు రోజుల కిందట కూడా ఇలాగే సర్వర్లు మొరాయించాయి. ఇప్పుడిలా జరగటం రెండోసారి.

  • Loading...

More Telugu News