: హోం సెక్రెటరీ జీతం ఆపండి: జార్ఖండ్ హైకోర్టు


హోం సెక్రెటరీ జీతాన్ని నిలుపుదల చేయాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, అశోక్ కుమార్ ఠాకూర్ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా రిటైర్ అయ్యాడు. అయినా ఇంతవరకు పదవీ విరమణ అనంతరం అందాల్సిన బెనెఫిట్స్ ఏవీ ఆయనకు అందలేదు. ఈ విషయమై ఆయన కోర్టుకెళ్లాడు. కేసును విచారించిన జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం (నిన్న) లోగా అశోక్ కుమార్ కు అందాల్సినవన్నీ క్లియర్ చేయాలంటూ ఆదేశించింది. అయినప్పటికీ సంబంధిత శాఖ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో హైకోర్టు సీరియస్ అయింది. అన్నీ క్లియర్ చేసేంతవరకు హోం శాఖ కార్యదర్శి జీతాన్ని నిలుపుదల చేయాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News