: అవిశ్వాసంపై సర్కారు దిమ్మతిరిగేలా నిర్ణయం తీసుకుంటాం: రేవంత్ రెడ్డి


ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ  బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక వ్యూహాలు అవలంబిస్తుందని ఆ పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. అవిశ్వాసంపై తాము తీసుకునే నిర్ణయంతో సర్కారుకు దిమ్మతిరగడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు.

అవిశ్వాసం విషయంలో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ ఒకే బాటలో నడుస్తుండడంపై ఆయన మాట్లాడారు. వాటి తాపత్రయమంతా రాజకీయలబ్ది కోసమే అని విమర్శించారు. కేసీఆర్.. ప్రొ. జయశంకర్ విగ్రహంపై.. వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ సమాధిపై ఒట్టేసి భవిష్యత్ లో తాము కాంగ్రెస్ తో కలవబోమని చెప్పగలరా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 

  • Loading...

More Telugu News