: సమైక్యానికే కట్టుబడి ఉన్నాం.. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ఆనం
తామంతా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ ముసాయిదా బిల్లును తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పీసీసీ చీఫ్ నుంచి ఎమ్మెల్యే వరకు అంతా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఏక తీర్మానంతో పాటు అవసరమైతే సభ్యుల మద్దతు కూడగట్టుకుని ఓటింగ్ కు కూడా పట్టుబడతామని మంత్రి వెల్లడించారు.