: ఎమ్మెల్యేలందరు అభిప్రాయాలు వెల్లడించిన తరువాతే బిల్లు రాష్ట్రపతికి: రఘువీరా
అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఎమ్మెల్యేలందరికీ కల్పించాలని మంత్రి రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో అందరూ అభిప్రాయాలు వెల్లడించిన తరువాతే రాష్ట్రపతికి బిల్లు పంపించాలని అన్నారు. అసెంబ్లీకి పంపిన బిల్లు ప్రకారం రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఆ నష్టాలన్నింటినీ కేంద్రం ముందుకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.