: స్మగ్లర్లపై పోలీసుల కాల్పులు
విలువైన దేశ సంపద ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్న స్మగ్లర్లపై ఈ రోజు పోలీసులు కాల్పులు జరిపారు. కొద్దిరోజుల క్రితం చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు చేసిన దాడిలో ఇద్దరు అటవీశాఖ సిబ్బంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన అనంతరం, శేషాచలం అడవుల్లో దాదాపు 500 మంది సాయుధ పోలీసులు కూంబింగ్ ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ రోజు కూంబింగ్ చేస్తున్న పోలీసులకు స్మగ్లర్లు కంటబడ్డారు. అయితే వెంటనే అలవాటు ప్రకారం స్మగ్లర్లు పోలీసులపై రాళ్లదాడి చేశారు. అలర్టయిన పోలీసులు వెంటనే తుపాకీకి పనిచెప్పి స్మగ్లర్లపై కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లందరూ పారిపోగా, పోలీసులు ఒక స్మగ్లర్ ను పట్టుకున్నారు.