: పార్టీలకు అతీతంగా పనిచేయాలి: శైలజానాథ్
రాష్ట్రం ముక్కలవకుండా ఉండేందుకు... సీమాంధ్ర నేతలు పార్టీలకు అతీతంగా పనిచేయాలని మంత్రి శైలజానాథ్ చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన బిల్లును సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరూ కలసికట్టుగా వ్యతిరేకించాలని కోరారు. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలకు అన్ని పార్టీల నేతలు కలిసి పనిచేస్తామని చెప్పారు. ఏపీఎన్జీవోలతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు.