: పెరోల్ పై సంజయ్ దత్ విడుదల
నటుడు సంజయ్ దత్ పెరోల్ పై ఈ రోజు విడుదలయ్యారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో కొన్ని నెలల నుంచి సంజయ్ పుణెలోని యరవాడ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భార్య మాన్యత అనారోగ్యంతో ఉన్నందున నెల రోజుల పెరోల్ కోసం గత నెలలో జైలు సూపరింటెండెంట్ కు దరఖాస్తు చేసుకోగా షరతులతో అనుమతి తెలిపారు. దాంతో, దత్ రెండు రోజులకోసారి ముంబయ్ లోని ఖర్ పోలీస్ స్టేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది.