: దిగ్విజయ్ మాటకు విలువ లేదు.. ‘సుప్రీం’కు అఫిడవిట్లు పంపుతాం: గంటా


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాటలకు విలువ లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దిగ్విజయ్ చెప్పేది ఒకటి, ఇక్కడ జరిగేది మరొకటి అని గంటా మండిపడ్డారు. సీఎం కిరణ్ తన పని తాను చేసుకుపోతున్నారని అన్నారు. విభజనపై రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, స్పీకర్ కు అఫిడవిట్లు పంపుతామని ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం విభజన అంశంపై ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని గంటా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News