: ఏడు చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు.. ఏడు లక్షలు స్వాధీనం: ఏకే ఖాన్
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై దాడులు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ చెప్పారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో ఇప్పటికే ఏడు చెక్ పోస్టుల్లో ఏడు లక్షల రూపాయల అవినీతి సొమ్ము బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఏసీబీ దాడులతో ప్రతి చెక్ పోస్టులో అవినీతి జరుగుతున్నట్లు తేలిందని, తనిఖీలను కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అక్రమాలకు బాధ్యులైన అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖాన్ చెప్పారు.