: లోక్ సభ ఎన్నికల్లో మతతత్వ శక్తులను ఓడించండి: ములాయం సింగ్
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మతతత్వ శక్తులను ఓడించాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ దేశ ప్రజలను కోరారు. దాంతో, బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ అహంకారాన్ని దెబ్బతీయాలన్నారు. ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న ములాయం ప్రసంగించారు. ప్రజలు తమతో ఉన్నంతకాలం మోడీ ఎలాంటి హానీ చేయలేరన్నారు. ఎప్పుడైతే తనకు, మోడీకి మధ్య ఎన్నికలు జరుగుతాయో అప్పుడే ఓటమి రుచి చూస్తారన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ అల్లర్లను ప్రస్తావించిన ఎస్పీ అధినేత.. ప్రతిచోట మోడీ ఎవరనే చర్చ జరుగుతోందన్నారు. అయితే, గుజరాత్ నరమేధానికి పాల్పడిన వ్యక్తిగానే ఇప్పటికీ అయన గురించి చర్చించుకుంటున్నారని ములాయం అన్నారు.