: ఢిల్లీలో ఇంగ్లీష్.. ఆంధ్రలో తెలుగు.. సీఎం తీరిది: ధూళిపాళ్ల
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళితే... అక్కడ ఇంగ్లీష్ లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడ్ని, ఆంధ్రప్రదేశ్ కు వస్తే తెలుగులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తిడతారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోనియాకు అర్థం కాకుండా తిట్లు తిడుతూ జాగ్రత్తపడుతున్నారని అన్నారు.
బిల్లు రాష్ట్రానికి వస్తే తడాఖా చూపిస్తానన్న సీఎం, తీరా బిల్లు వచ్చాక నోరు మెదపలేదని అన్నారు. అన్నీ అయిపోయిన తరువాత మళ్లీ బంతులున్నాయి, బ్యాట్స్ మన్ ఉన్నారు అని పాతపాటే పాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇన్ని మాటలు చెప్పే సీఎం బీఏసీ సమావేశంలో ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.