: మహిళా భద్రతకు మద్దతివ్వడం చాలా ముఖ్యం: కరీనా కపూర్
బాలీవుడ్ నటి కరీనాకపూర్ దేశంలో మహిళా భద్రతపై తనదైన ప్రచారం చేస్తోంది. ఢిల్లీలో మహిళలకు భద్రత ఉందంటే తాను ఎంత మాత్రం నమ్మనంటోంది. మహిళా భద్రతపై 'స్టార్ నెట్ వర్క్' నిర్వహిస్తున్న కార్యక్రమంలో కరీనా పాలుపంచుకుంది. ఈ సందర్భంగా స్టార్ నెట్ వర్క్ తో కలిసి చానల్ 'వి' తీసుకొచ్చిన 'విత్ యు' యాప్ ను కరీనా ఆవిష్కరించింది. మొబైల్లో ఈ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని ఒక బటన్ నొక్కితే మనం ఎక్కడున్నా వెంటనే స్నేహితులు, సంరక్షకులకు తెలిసిపోతుంది. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ.. నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మహిళా భద్రత చాలా ముఖ్యమని తెలిపింది. మహిళా భద్రతకు మద్దతివ్వడం నటులకు చాలా ముఖ్యమని... ఎందుకంటే వారి నుంచి ఏ సందేశమైనా త్వరగా ప్రజలకు చేరుకుంటుందని తెలిపింది.