: గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు రూ. 110 కోట్లు: కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో సీఎం


వేసవిలో నీటి ఎద్దడి నివారణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టి సారించారు. ఈ రోజు సాయంత్రం ఆయన జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కలెక్టర్లకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు రూ. 110 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.

కాగా, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ. 90 కోట్లతో ప్రణాళిక రూపొందించామని, తక్షణమే రూ. 20 కోట్లు విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇక, ఏప్రిల్ 1 నుంచి ఉపాధి హామీ పథకంలో దినసరి వేతనం రూ. 149 పెంచుతున్నట్టు ప్రకటించారు. 

  • Loading...

More Telugu News