: గురజాల మాజీ ఎమ్మెల్యే కాయితి నర్సిరెడ్డి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే కాయితి నర్సిరెడ్డి కన్నుమూశారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1989 లో గురజాల నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.