: అందులో కొత్తేముంది.. ఊహించిందే కదా?: నితీష్ కుమార్
త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదరనుందని వస్తున్న వార్తలు కొత్త కాదని.. ఊహించినవేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ ఆ రెండు పార్టీలు యూపీఏలో భాగస్వాములే కనుక ఇప్పుడు కొత్తగా పొత్తేముందని అన్నారు. అయితే వారి పొత్తు తమకు ఆందోళన కలిగించేంత పెద్ద విషయం కాదని నితీష్ కుమార్ కొట్టిపడేశారు.