: కాంగ్రెస్ లో నాయకత్వ లోపం ఉంది: అమర్త్యసేన్
దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ అప్పుడప్పుడు తన అభిప్రాయాలను విస్పష్టంగా తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో నాయకత్వ లోపం నెలకొందన్నారు. ప్రజలు కోరుకునేది, ఊహించేది వారు తీర్చలేరని వ్యాఖ్యానించారు. కారణం దేశ ప్రజల్లో కాంగ్రెస్ పై అయిష్టత పెరగడమేనని సేన్ పేర్కొన్నారు. అందుకే తాజా ఎన్నికల్లో హస్తం పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని విపులీకరించారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సేన్, 'ఫర్ గివింగ్ గుడ్ లీడర్ షిప్' పై ప్రసంగించారు. ఒక నేత అంటే ఎవరు?, అతని ఆలోచన ఏమిటీ? అనేవి ప్రజలకు తప్పకుండా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.