: సికింద్రాబాదు బంగారం దుకాణాల్లో తనిఖీలు
సికింద్రాబాదులోని బంగారం దుకాణాల్లో తూనికలు కొలతల శాఖ ఈ రోజు తనిఖీలు నిర్వహించింది. మొత్తం 25 బంగారం దుకాణాలపై అధికారులు కేసులు నమోదు చేశారు. తూకంలో మోసాలకు పాల్పడుతున్నారని, కల్తీ బంగారం అమ్ముతున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదు రావడం వల్లే ఈ దాడులు నిర్వహించినట్లు డీజీ గోపాల్ రెడ్డి తెలిపారు. ఇకపైనా తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు.