: మంత్రి శ్రీధర్ బాబు బాధితుడికి చికిత్స అందించండి: హైకోర్టు ఆదేశం
మంత్రి శ్రీధర్ బాబు నుంచి తన భర్తకు, తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ స్వరూప అనే మహిళ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు చేసిన అక్రమాలపై కరపత్రాలు ముద్రించాడనే కక్షతో గోదావరి ఖని పోలీసుల చేత అరెస్టు చేయించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని స్వరూప పిటిషన్ లో పేర్కొంది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు నిందితుడిని కరీంనగర్ జైలు నుంచి తరలించి వెంటనే చికిత్స అందించాలని ఆదేశించింది.