: పిచ్ పైనే ప్రాణాలొదిలిన క్రికెటర్
రమణ్ లాంబా గుర్తున్నాడా? ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా బ్యాట్స్ మన్ కొట్టిన బంతి బలంగా తాకి కోమాలోకెళ్లి మరణించాడు. క్రికెట్ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ ఘటన గుర్తుండే ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే పాకిస్థాన్ లోని సుక్కుర్ నగరంలో చోటుచేసుకుంది. సూపర్ స్టార్ క్రికెట్ క్లబ్ తరపున పాకిస్థాన్ లో ఆడే జుల్ఫికర్(22) వన్ డౌన్ బ్యాట్స్ మన్. ఈ కుర్రాడు క్రీజులో వుండగా వేగంగా దూసుకొచ్చిన షార్ట్ పిచ్ బంతి అతని ఛాతిని బలంగా తాకింది. అంతే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు పోయాయని డాక్టర్లు నిర్థారించారని అధికారి వెల్లడించారు.