: రాష్ట్రపతిని కలిసి పరిణామాలను వివరిస్తాం: కోదండరాం
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. విభజన నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వివరిస్తామని ప్రొఫెసర్ కోదండరాం మీడియాకు తెలిపారు. తెలంగాణ ప్రజల తరపున రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రపతి, స్పీకర్ లకు అఫిడవిట్లు సమర్పించాలని కూడా నిర్ణయించామన్నారు. అటు విభజన బిల్లులో మార్పులు, చేర్పుల అంశాలకు సంబంధించిన అఫిడవిట్లపై తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల సంతకాలు సేకరించాలనుకున్నట్లు వివరించారు. వాటితోపాటు తెలంగాణ ముసాయిదా బిల్లుపై జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించనున్నామన్నారు.