: అస్వస్థతతో ఎయిమ్స్ లో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిన్న (గురువారం)ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. చక్కెర స్థాయి, రక్తపోటు స్థాయిలు పడిపోవడం, మూత్రనాళ సమస్యలతో వెంటనే ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని ఆసుపత్రి అధికారి ఒకరు తెలిపారు.