: అశోక్ బాబుకు వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి లేఖ
ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుకు వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి లేఖ రాశారు. 21న జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకాబోమని స్పష్టం చేశారు. తమను భేటీకి పిలిచినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. విభజనకు అనుకూలంగా ఉన్నవారితో తాము కలవబోమని, అటువంటి వారితో వేదిక పంచుకోమని తెలిపారు. సమైక్యవాద పార్టీలను పిలిస్తేనే తమ అధ్యక్షుడు సమావేశానికి వస్తారని చెప్పారు.