: గంగూలీ క్రికెట్ కోచింగ్ సెంటర్ పై ఏడాది కాలం నిషేధం
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్రికెట్ కోచింగ్ సెంటర్ పై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(సీఏబీ) ఏడాది కాలం పాటు నిషేధం విధించింది. దాంతో పాటు మరో 12 కోచింగ్ సెంటర్లపైనా వేటు వేసింది. వయో పరిమితికి సంబంధించి తప్పుడు ధృవపత్రాలతో వయసు తక్కువ చూపారన్న కారణంతో 42 మంది ఆటగాళ్లపై సీఏబీ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. సెప్టెంబర్ నెలలో జరిగిన అండర్-14 సబ్ జూనియర్, అండర్-17 జూనియర్ టోర్నమెంట్లలో ఆటగాళ్ల వయస్సులపై నిన్న(గురువారం) విచారణ జరిపిన బెంగాల్ అసోసియేషన్ ఈ నిర్ణయం ప్రకటించింది. మరోసారి ఇలాంటి తప్పులు పునరావృతమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.