: అమెరికా దురహంకారాన్ని సహించేది లేదు: కమల్ నాథ్
భారతీయ దౌత్య వేత్త దేవయానిపై అగ్రరాజ్యం వ్యవహరించిన తీరు సరికాదంటూ గత మూడు రోజులుగా భారత్ లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం కూడా రంగంలోకి దిగి అమెరికా దౌత్యకార్యాలయానికి పలు సౌకర్యాలను తీసివేసింది. అయినప్పటికీ దేవయాని ఉదంతంపై క్షమాపణలు కోరే సమస్యలేదని అమెరికా తేల్చిచెప్పింది. దీంతో కేంద్ర పార్లమెంటరీ శాఖా మంత్రి కమల్ నాథ్ అమెరికా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అగ్రరాజ్య దురహంకారాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. తాము చెబుతున్నా కేసులు ఉపసంహరించుకోనంటుండడం పట్ల ఆయన మండిపడ్డారు. దౌత్యనిబంధనలను అనుసరించి చర్యలు తీసుకుంటామన్నారు. సోదాల పేరిట భారతీయులపట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరును ఆయన ఖండించారు.