: ఉపాధ్యాయుడికి బడితె పూజ


కృష్ణా జిల్లా నందిగామ మండలం అనసాగరంలోని జిల్లాపరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడికి గ్రామస్తులు బడితె పూజ చేశారు. వివరాల్లోకి వెళ్తే, సదరు ఉపాధ్యాయుడు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడుతున్నారని విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాలపైకి దండెత్తిన గ్రామస్థులు స్కూల్ లోని నాగేశ్వర్ రావు అనే ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. దీంతో ఉపాధ్యాయులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News