: ఏకమై అడ్డుకుందాం, కలిసి రండి: శైలజానాథ్ పిలుపు


రాష్ట్ర అక్రమ విభజనను అడ్డుకునేందుకు పార్టీలకతీతంగా కలిసి రావాలని మంత్రి శైలజానాథ్ సీమాంధ్ర నేతలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ శాసనసభ ఆమోదం లేకుండా కొత్త రాష్ట్రం ఏర్పాటైన ఉదంతం దేశంలోనే లేదని అన్నారు. రాష్ట్రవిభజనను అడ్డుకునేందుకు చట్టసభల్లో, న్యాయస్థానాల్లో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన తెలంగాణ ముసాయిదా బిల్లు అసమగ్రంగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఓట్లు సీట్లు అంటూ కొందరు మాట్లాడటం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News