: గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్ బీఐ,హెచ్ డీఎఫ్ సీ


గృహ రుణాలను భారీగా ఇచ్చే ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులు... ఇంటి రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించాయి. హౌసింగ్ లోన్లను కొత్తగా తీసుకునే వినియోగదారులకు 0.4 శాతం వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. నిన్న జరిగిన ద్రవ్యపరపతి సమీక్షలో ఆర్ బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచిన నేపథ్యంలో, ఈ రెండు బ్యాంకులు ఈ నిర్ణయానికి వచ్చాయి. అయితే, మహిళా రుణ గ్రహీతలకు మాత్రం అదనంగా మరో 0.05 శాతం వడ్డీని తగ్గిస్తున్నామని ఎస్ బీఐ ప్రకటించింది.

  • Loading...

More Telugu News