: న్యాయం జరిగే వరకు పోరాటం ఆపం: అఖిలపక్షం


కృష్ణా మిగులు జలాలపై కింది రాష్ట్రాలకు కూడా హక్కు ఉండాలని ప్రధానికి తెలిపామని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ చెప్పారు. ప్రధానితో భేటీ అనంతరం అఖిలపక్షం తరఫున హాజరైన నేతలు మీడియాతో మాట్లాడారు. మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి దారుణమైన పరిస్థితి తలెత్తిందని చెప్పామన్నారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు నీటిని కేటాయించేలా న్యాయం చేయాలని ప్రధానిని కోరినట్టు బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని పీఎంను కోరినట్టు సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి చెప్పారు. కృష్ణా జలాలపై న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని అఖిలపక్షానికి హాజరైన నేతలందరూ ముక్తకంఠంతో తెలిపారు.

  • Loading...

More Telugu News