: అమెరికా వాళ్లకు విప్పి చూడ్డం అలవాటే


అమెరికా అభివృద్ధి చెందిన అగ్రరాజ్యమే. కానీ, అక్కడి వారిలో మానవత్వాన్ని పెద్దగా ఆశించరాదు. వారికి నచ్చిందే చేస్తారు. నిబంధనలను గుడ్డిగా అమలు చేసేస్తారు. ఒక దేశ దౌత్యవేత్త పట్ల ఎంతో గౌరవం, మర్యాదతో నడచుకోవాలనే నీతి సూత్రాన్ని ప్రపంచంలో అన్ని దేశాలూ అనుసరించే విధానం. కానీ, అమెరికాకు ఇలాంటివేవీ పట్టవు. అవకాశం దొరికితే, అమెరికన్లు కాకపోతే చాలు.. వారిలో క్రూరత్వం బయటకు వస్తుంది.

అమెరికన్ చట్టాల ప్రకారం అక్కడ నిందితులందరినీ ముందుగా బట్టలూడదీసి శోధిస్తారు. వారికి అంతలా భయం. అగ్రరాజ్యంలో నేరస్థులు కూడా అత్యాధునికంగా ఉంటారని వారి భయం. ఎక్కడో ఏ మూలో వారు విస్ఫోటక పదార్థాలో.. మారణాయుధాలో దాచి ఉంటారనే వణుకు. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారైనా సరే విప్పి చూడాల్సిందే. అప్పుడే అక్కడి దర్యాప్తు అధికారులకు నిశ్చింత. నిందితులను జైలుకు తీసుకొచ్చాక, వారిని కోర్టుకు తీసుకెళ్లి, మళ్లీ జైలుకు తీసుకొచ్చాక కూడా చూడాల్సిందే. అక్కడి చట్టాల ప్రకారం విప్పి వెతకటం ఒక ప్రక్రియ.

వాస్తవానికి పౌర స్వేచ్ఛా సంస్థలకు చెందిన న్యాయవాదులు ఈ ప్రక్రియ అనవసమని వాదిస్తూనే ఉన్నారు. కానీ, అక్కడి కోర్టులు, ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఆ ప్రక్రియను సమర్థించాయి. సమర్థిస్తున్నాయి. సమర్థిస్తూనే ఉంటాయి! ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారితో సహా నిందితులందరికీ ఈ ప్రక్రియను అమలు చేయవచ్చని అక్కడి సుప్రీంకోర్టే విస్పష్టమైన తీర్పునిచ్చింది.

  • Loading...

More Telugu News