: తీర్పును గెజిట్ లో చేర్చరాదని ప్రధానిని కోరాం: రావుల


బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో మిగులు జలాలపై మన రాష్ట్రం హక్కులు కోల్పోయిన సంగతిని ప్రధానికి తెలియజేశామని టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి చెప్పారు. ప్రధానితో అఖిలపక్షం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రైబ్యునల్ తీర్పును గెజిట్ లో చేర్చరాదని ప్రధానిని కోరామని తెలిపారు. తీర్పును పరిశీలించాల్సిందిగా సీడబ్ల్యూసీని కోరతామని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర పిటిషన్ లో ఇంప్లీడ్ కావాలని ప్రధానిని కోరామని... అయితే తనకు కొన్ని పరిమితులున్నాయని ఆయన చెప్పినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News