: దేవయానిపై కేసు ఉపసంహరించం: అమెరికా
భారత దౌత్యవేత్త దేవయానిపై కేసు చట్ట ప్రకారం కొనసాగుతుందని, ఎత్తివేయబోమని అమెరికా స్పష్టం చేసింది. కుట్ర ప్రకారం తమ దేశ దౌత్యవేత్తపై పెట్టిన కేసును ఉపసంహరించుకుని, విస్పష్టమైన క్షమాపణలు చెప్పాలని భారత్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కేసును తొలగించేది లేదని, దేవయానిపై వచ్చిన ఆరోపణలను తమ దేశంలో తీవ్రంగా పరిగణిస్తామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ తెలిపారు.