: రాందేవ్ 'స్వలింగ సంపర్కులు' వ్యాఖ్యలపై కాంగ్రెస్ నోటీసు
'కాంగ్రెస్ నేతలు స్వలింగ సంపర్కులు' అంటూ వ్యాఖ్యానించిన బాబా రాందేవ్ కు ఆ పార్టీ పరువు నష్టం నోటీసు పంపింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ న్యాయ విభాగం జనరల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ ద్వివేది నోటీసు ఇచ్చారు. 'కాంగ్రెస్ కార్యకర్తల్లో ఎక్కువ మంది స్వలింగ సంపర్కాన్ని సమర్థిస్తున్నారు.. వారందరూ ఆ బాపతే' అని బాబా రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. దీంతో, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసులో బాబాను కోరారు.