: నేడు టీజేఏసీ అత్యవసర భేటీ
తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ అత్యవసర భేటీ ఈ రోజు జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాసలు పాల్గొంటున్నాయి. అసెంబ్లీలో టీబిల్లుపై చర్చను చేపట్టకుండా... సభను ఏకంగా జనవరి 3వ తేదీ వరకు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. టీబిల్లును తొక్కిపెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రయత్నిస్తున్నారని... వారి తీరును ఖండించాలని ఐకాస నేతలు నిర్ణయించారు. దీనికి తోడు, వివిధ జేఏసీలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను కూడా ఈ సమావేశంలో చర్చించి రూపొందించనున్నారు.