: సంతు లేదని చింతించాల్సిన పనిలేదు


పెళ్లై ఎంతకాలం అయినా తమకు సంతానం లేదని చాలామంది బాధపడుతుంటారు. ఇక అలాంటి బాధలకు స్వస్తి చెప్పవచ్చు. ఎందుకంటే, యాభైయ్యేళ్లయినా కూడా సంతానం పొందవచ్చని వైద్యులు నిరూపించారు. పెళ్లై పాతికేళ్లుగా సంతానం కోసం ఎదురుచూపులు చూసిన ఒక జంటకు ఎట్టకేలకు యాభైయేళ్ల వయసులో సంతానం కలిగింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. సేలం జిల్లా శంకరగిరి ప్రాంతానికి చెందిన యాభై నాలుగేళ్ల వేలప్పన్‌, ఆయన భార్య 51 సంవత్సరాల పంకజంకు పెళ్లై పాతికేళ్లయినా సంతానం కలగలేదు. దీంతో పలు రకాలుగా ప్రయత్నించి విసిగిపోయారు. ఈ దంపతుల కలలను చెన్నైకి చెందిన మారుతి మెడికల్‌ సెంటర్‌ వైద్యులు సాకారం చేశారు.

యాభైయ్యేళ్ల వయసులో ఇంట్రా వెజైనల్‌ కల్చర్‌ ఆఫ్‌ ఒక్యాటిస్‌ (ఐఎన్‌వీవో సెల్‌) విధానం ద్వారా ఈ దంపతులకు సంతానం కలిగేలా చికిత్స అందించారు. మారుతి మెడికల్‌ సెంటర్‌కు చెందిన వైద్యులు డాక్టర్‌ నిర్మలా సదాశివన్‌ వారికి చికిత్స చేశారు. అమెరికాలో ఈ ఆధునిక వైద్య విధానం 2011లో వచ్చిందని తాము ఈ ఏడాది చెన్నైలో ప్రవేశపెట్టినట్టు నిర్మల తెలిపారు. ఈ విధానం ద్వారా ఐవీఎఫ్‌ విధానంకంటే కూడా చికిత్స సులభంగా ఉంటుందని, దీనికయ్యే ఖర్చు కూడా తక్కువేనని నిర్మల తెలిపారు.

  • Loading...

More Telugu News