: ఇక అరగుండుపై కూడా జుట్టు మొలుస్తుంది


ఒక వయసు వచ్చిన తర్వాత చాలామందికి వచ్చే సమస్యల్లో ఒకటి బట్టతల. అరగుండుగా మనవాళ్లు ముద్దుగా పిలుచుకునే బట్టతల సమస్య చాలామందిని వేధిస్తోంది. కొందరికి చిన్న వయసులోనే బట్టతల ప్రాప్తిస్తుంటుంది. ఇలాంటి వాళ్లకు మాత్రం ఇదొక శుభవార్తే. ఎలాగంటే బట్టతలకు మూలకారణం ఏమిటి? అనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. బట్టతల రావడానికి ఒక జన్యువులో జరిగే మార్పే కారణమని, దాన్ని అడ్డుకుంటే తిరిగి జుట్టు మొలిచేలా చేయవచ్చని పరిశోధకులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు బట్టతలకు దారితీసే జన్యువుల ఆచూకీని గురించి, వాటిలో జరిగే మార్పును గుర్తించారు. మన జుట్టు ఎదుగుదలలో కీలక పాత్రను పోషించే ఈ జన్యువు గుట్టును తెలుసుకోవడం వల్ల రాలిన జుట్టు స్థానంలో మళ్లీ జుట్టును మొలిచేలా చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మన జుట్టుకు సంబంధించి డబ్ల్యూఎన్‌టీ7బీ అనే జన్యువు వెంట్రుకలు పెరగడంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఈ జన్యువులో పలు రకాల మార్పులు జరగడం వల్ల వెంట్రుకలు రాలిన తర్వాత మళ్లీ పెరగవని, దానివల్ల బట్ట తల వస్తోందని, ఈ మార్పులను అడ్డుకున్నట్టయితే రాలిన వెంట్రుక మళ్లీ మొలిచేలా చేయవచ్చని పరిశోధకులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News