: వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: షిండే


వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర హోంశాఖా మంత్రి సుశీల్ కుమార్ షిండే న్యూఢిల్లీలో తెలిపారు. దాంతో పాటే మతహింస నిరోధక బిల్లును కూడా ప్రవేశపెడతామని షిండే స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ రాష్ట్రానికి పంపిన విషయం విదితమే. బిల్లుపై చర్చించి శాసన సభ అభిప్రాయం తెలిపేందుకు జనవరి 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు.

  • Loading...

More Telugu News