: సినిమా లేటవ్వడానికి కారణం మహేష్ బాబే: సుకుమార్
మహేష్ బాబుతో సినిమాలు చేసిన ధర్శకులంతా.. ఆయనతో మళ్లీ సినిమా చేయాలని ఉందని తనతో చెప్పేవారని ‘1-నేనొక్కడినే‘ సినిమా దర్శకుడు సుకుమార్ చెప్పారు. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అలా వారు ఎందుకు చెప్పేవారో తనకు అర్థమయిందని సుకుమార్ అన్నారు. ఈ సినిమా తీసేందుకు చాలా రోజులు పట్టిందని అందరూ అనుకుంటున్నారని.. అయితే దానికి కారణం మహేష్ బాబేనని ఆయన తెలిపారు. సినిమా షూటింగ్ పూర్తయిపోతే ఎక్కడ తనను మహేష్ వదిలేస్తారోనని.. ఇంత కాలం సినిమా షూటింగ్ కొనసాగించానని సుకుమార్ నవ్వుతూ చమత్కరించాడు.