: బిల్లులో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయి: గాదె
తెలంగాణ ముసాయిదా బిల్లులో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకట రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతి ముందు జాగ్రత్తగానే క్లాజ్ ల వారీగా అభిప్రాయం చెప్పమన్నారని అన్నారు. ఉమ్మడి రాజధాని అంశం దేశంలో ఎక్కడా లేదని అన్న గాదె, గవర్నర్ పాలన అనడం రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధమని సూచించారు.