: ఆపుతాడో.. ఆగిపోతాడో తెలుస్తుంది: వీహెచ్
ముఖ్యమంత్రి కిరణ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు తప్పదని తెలిసినా... ఇంకా లాస్ట్ బాల్ ఉందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. విభజనను ఆయన ఆపుతాడో లేక ఆయనే ఆగిపోతాడో కొన్ని రోజుల తర్వాత మీకే తెలుస్తుందని విలేకరులను ఉద్దేశించి అన్నారు. ఇప్పటికే సీఎం అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్నారన్న సంగతి ఢిల్లీ పెద్దలకు తెలిసిపోయిందని... రాష్ట్రపతి పంపిన బిల్లును కూడా కిరణ్ లెక్కచేయడం లేదన్న సంగతి కూడా వారికి అర్థమైపోయిందని వీహెచ్ తెలిపారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి విషయంలో ఏమైనా జరగొచ్చని అభిప్రాయపడ్డారు.