: సీఎం కిరణ్ ప్రసంగంలో స్పష్టత లేదు: యనమల రామకృష్ణుడు
తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసన మండలిలో ముఖ్యమంత్రి కిరణ్ చేసిన ప్రసంగంలో స్పష్టత లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. సున్నిత అంశంపై మాట్లాడిన సీఎం కిరణ్.. చర్చకు సంబంధించిన పూర్తి వివరాలు సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. చర్చ ఎప్పుడు, ఎలా జరుగుతుంది, దానికి ఎంత సమయం పడుతుందన్న వివరాలు ముఖ్యమంత్రి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.