: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీరామదీక్ష విరమణ
ఖమ్మం జిల్లాలోని భద్రాచలం రామాలయం ఇవాళ భక్తుల రామనామ స్మరణతో మార్మోగింది. 27 రోజులుగా శ్రీరామ పునర్వసు దీక్షను చేపట్టిన భక్తులు... ఇవాళ విరమించారు. భద్రాచల గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత భద్రుని మండపంలో దీక్ష విరమణ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సీతారామస్వామి దర్శనం చేసుకొన్నారు.