: హైదరాబాదు పాతబస్తీలో అమానుషం.. బాలికపై సామూహిక అత్యాచారం
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఇవాళ దారుణ ఘటన జరిగింది. ముక్కుపచ్చలారని బాలికపై ముగ్గురు మైనర్ బాలురతో పాటు ఓ వ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనకు పాల్పడిన నలుగురినీ అదుపులోకి తీసుకుని, వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు భవానీనగర్ పోలీసులు చెప్పారు.
బాధిత బాలికను నమ్మించి స్నేహితుడు బయటకు తీసుకువెళ్లాడు. ఓ వాహనంలో తిరుగుతూ, అతడు తన స్నేహితులు, ఓ వ్యక్తితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.