: వాయిదా బాటలో మండలి.. మళ్లీ జనవరి 3న శాసనమండలి సమావేశం
ఇవాళ శాసన మండలి కూడా వాయిదా పడింది. మండలి సమావేశం జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యులు ఆందోళనలకు దిగారు. సభా కార్యక్రమాలు సాగకుండా అడ్డుకోవడంతో ఉదయం నుంచి పలుమార్లు మండలి వాయిదా పడుతూ వచ్చింది. చివరకు వచ్చే నెల 3వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ చక్రపాణి ప్రకటించారు.