: నీలేకని దంపతుల రూ. 50 కోట్ల విరాళం
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటి ఆఫ్ ఇండియా (ఆధార్) ఛైర్మెన్ నందన్ నీలేకని, అతని సతీమణి రోహిణి... ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసర్చ్ (NCAER) సంస్థకు రూ. 50 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. నీలేకని ఎన్ సీఏఈఆర్ కు ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ మన దేశంలోని అనేక రంగాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై రీసర్చ్ చేయడంతో పాటు, సర్వేలను కూడా నిర్వహిస్తుంటుంది. 1950ల నుంచి ఈ సంస్థ ఇప్పటిదాకా ఇచ్చిన సలహాలు మన దేశ పురోభివృద్ధిలో ఎంతగానో ఉపయోగపడ్డాయి.