: ధోనీ, రహానే, జహీర్ ఔట్


జొహానెస్ బర్గ్ లో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో రెండు రోజు ఇండియా తడబడుతోంది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే భారత్ ధోనీ, రహానే, జహీర్ ఖాన్ వికెట్లను కోల్పోయింది. 47 పరుగులు చేసిన రహానే ఫిలాండర్ బౌలింగ్ లో డీవిలియర్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ ధోనీ కూడా కేవలం 19 పరుగులకే మోర్కెల్ బౌలింగ్ లో డీవిలియర్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జహీర్ ఖాన్ ఖాతా కూడా తెరవకుండానే, ఫిలాండర్ బౌలింగ్ లో లెగ్ బిఫోర్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం అశ్విన్, ఇషాంత్ శర్మ క్రీజులో ఉన్నారు. భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News