: బిల్లుపై అభ్యంతరాలతో కేంద్రానికి సీమంధ్ర నేతల లేఖ
ముసాయిదా బిల్లు విధివిధానాలపై అభ్యంతరాలు తెలుపుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా కేంద్రానికి లేఖరాశారు. బిల్లులోని ఆర్థిక నివేదికలోని వివిధ అంశాలు బిల్లుతో పాటు అందించాలని లేఖలో డిమాండ్ చేశారు. కేంద్రానికి పంపిన లేఖలో పార్టీలకు అతీతంగా టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, సీపీఎం పార్టీల నేతలు సంతకాలు చేశారు.