: స్పీకర్, రాష్ట్రపతి, సుప్రీంకు అఫిడవిట్లు పంపుతాం: మంత్రి గంటా
విభజనపై సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధుల వ్యతిరేకత చాటేలా స్పీకర్, రాష్ట్రపతి, సుప్రీంకోర్టులకు అఫిడవిట్లు పంపిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో కచ్చితంగా ఓడిస్తామని అన్నారు. అప్పటికీ కేంద్రం రాష్ట్ర విభజనవైపే మొగ్గు చూపితే సుప్రీంకోర్టుకు వెళ్తామని గంటా హెచ్చరించారు.