: బంగ్లాదేశ్ లో ఎనిమిది మందికి మరణ శిక్ష


బంగ్లాదేశ్ లో నడిరోడ్డుపై జరిగిన దారుణ హత్య ఘటనలో నిందితులకు మరణ శిక్షే సరైనదని న్యాయస్థానం వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 9న జరిగిన ఈ హత్యా ఘటనలో ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది ఛాత్రా లీగ్ కు చెందిన విద్యార్థులకు మరణశిక్ష విధించింది. మరో 13 మందికి జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే జీవిత శిక్ష పడిన వారిలో 11 మంది, మరణ శిక్ష పడిన వారిలో ఇద్దరు ప్రస్తుతం పరారీలో వున్నారు. నేరస్థుల్లో అత్యధికులు జగన్నాథ్ యూనివర్శిటీ విద్యార్థులు కాగా.. వీరంతా చాత్రా లీగ్ విద్యార్థి విభాగానికి చెందిన కార్యకర్తలు.

ఢాకా నగరంలో గత డిసెంబర్ 9వ తేదీన ఓ టైలర్ పై నడిరోడ్డుపై దాడి చేసి, దారుణ హత్యకు పాల్పడ్డారని.. పట్టపగలు అందరూ చూస్తుండగానే వెంబడించి, మారణాయుధాలతో పొడిచి చంపడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. నేర తీవ్రత దృష్ట్యా నిందితులకు మరణ శిక్షలే సరైనవని న్యాయమూర్తి హక్ వ్యాఖ్యానించినట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది.

  • Loading...

More Telugu News