: మా మధ్య ఘర్షణకు కోట్లు ఖర్చు పెట్టారు: కేజ్రీవాల్


ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేకు, తనకు మధ్య విభేదాలు సృష్టించడానికి రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ ఆరోపించారు. అన్నా తనకు గురువని, ఎప్పటికీ తన హృదయంలో ఉండిపోతారని చెప్పారు. తన గురించి ఏం మాట్లాడడానికైనా అన్నాకు హక్కులున్నాయని పేర్కొన్నారు. అయితే, ఏ పార్టీలు కుట్ర చేశాయని విలేకరులు ప్రశ్నించగా.. అన్ని పార్టీల్లోని చెడ్డ వ్యక్తుల పనిగా తెలిపారు. అయితే, నిరాహార దీక్ష ద్వారా లోక్ పాల్ ను సాధించిన అన్నాహజారేకు శిష్యుడిగా కేజ్రీవాల్ అభినందనలు తెలుపడం మాత్రం మర్చిపోయారు.

  • Loading...

More Telugu News